పుదుచ్చేరిలో కాంగ్రెస్ సర్కార్ ఖతం అయిపోయింది. బలనిరూపణలో విఫలమయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో నారాయణ స్వామి రాజీనామా లేఖతో రాజ్ భవన్ కు నారాయణస్వామి బయలుదేరినట్టు చెబుతున్నారు. ఇక పుదుచ్చేరి అధికార పార్టీలో నారాయణ స్వామి తీరు పై కొన్నాళ్లుగా పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పదవుల్లోనూ తమకు అన్యాయం జరిగిందంటూ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ నమశివాయం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ పోస్టు ఖాళీ అవ్వడంతో సీనియర్ నేత లక్ష్మీనారాయణ్ పీసీసీ చీఫ్ ఇవ్వాలని కోరారు. ఇటు అధిష్టానం కూడా లైట్ తీసుకుంది. పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం రాజీనామా చేశారు. తాను సీనియర్ నాయకుడినైనా కనీసం మంత్రి పదవి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, ఈ సంక్షోభానికి తనని నిందించొద్దన్నారు. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్దాన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తరువాత మల్లాడి కృష్ణారావు, జాన్కుమార్ రాజీనామాలు చేశారు. ఇప్పుడు మరో ఇద్దరి రాజీనామాతో కూటమి బలం 12కు పడిపోయింది. మరోవైపు విపక్షం బలం 14గా ఉంది.