మెగా స్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలు ఓకే చేస్తూ మంచి జోరు కనబరుస్తున్నారు. చిరు ఎక్కువగా ఇతర భాషల్లో భారీ హిట్ అందుకున్న సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా చిరు మొదటగా ఎంచుకున్ రెండు సినిమాల్లో లూసిఫర్ ఒకటి. ఈ సినిమాను తెలుగులో తమిళ దర్శకుడ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారతో సంప్రదింపులు చేశారని, అందుకు ఆమె కూడా ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇదే పాత్ర గురించి మరో వార్తలు హల్చల్ అవుతోంది. ఈ సినిమా నుంచి నయన్ తప్పుకున్నారంట. ఇప్పుడు చిరు సినిమా కోసం మరో స్టార్ హీరోయిన్ త్రిషతో చర్చలు జరిపారంట. ఆమె వెంటనే సినిమాకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలో ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.