గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండగా, మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశి నటిస్తుంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.ఈ చిత్రంలో గోపీచంద్-తమన్నాలు కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి!