యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్జ. అతడు ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో ఉండగానే మాటల మాంత్రికుడు దర్శకత్వంలో తన తదుపరి చిత్రానికి ఒకే చెప్పారు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన అరవింద సమేతా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి వీరి కాంబోలో పొలిటికల్ డ్రామా తెరకెక్కనుందని వార్తుల వస్తున్నాయి. ఈ విధంగా ఈ సినిమాపై అనేక వార్తలు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లని అందులో రెండో హీరోయిన్గా బాలీవుడ్ భామ వరీనా హుస్సేన్ నటిస్తున్నారని టాక్ వచ్చింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల కారణంగా ఈ వార్త పుట్టుకొచ్చింది. ఈ వార్తపై ఇటీవల క్టారిటీ వచ్చింది. ఈ సినిమాలో వరీనా హుస్సేన్ నటించడం లేదంట. అయితే ఆమె ఎన్టీఆర్ ప్రొడక్షన్లో కళ్యాణ్ రామ్‌తో అమ్మడు నటించనున్నారంట. అంతేకాకుండా వరీనా ప్రస్తుతం మరో రెండు సౌత్ సినిమాలను ఓకే చేశారంట.