విజయవాడ దుర్గగుడిలో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే గుడిలో వెండి ప్రతిమలు దొంగతనం తరువాత అధికారులు దుర్గగుడిలో జరుగుతున్న అక్రమాలపై కూడా దృష్టి సారించారు. గత మూడు రోజులుగా ఏసీబీ అధికారులు దుర్గగుడిలో సోదాలు నిర్వహించారు. మూడు రోజుల ఏసీబీ సోదాల్లో అవినీతి అక్రమాలు చాలా వెలుగు చూశాయి. ఏసీబీ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు దేవాదాయశాఖ కమిషనర్. అన్నదానం, టికెట్ల అమ్మకాలు, చీరల విభాగాల్లో అక్రమాలపై నివేదిక అందించారు. దాంతో మొత్తం 7 విభాగాల్లో ని ఐదుగురు సూపరింటెండెంట్లు, 8మంది సిబ్బందిని సస్పెండ్ చేసారు.