కడప జిల్లా కొప్పర్తి గ్రామంలో 598.59 ఎకరాల భూమిలో మెగా ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుపై కెబినెట్లో సమీక్ష నిర్వహించారు. ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి ఉచితంగా ఇచ్చేందుకు కెబినెట్లో చర్చించారు. కడప జిల్లా అంబాపురం గ్రామంలో మరో మెగా ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు 93.99 ఎకరాల కేటాయించారు. ఈ భూములనూ ఏపీఐఐసీకి ఉచితంగా ఇచ్చే అంశంపై కెబినెట్ నిర్ణయం తీసుకోనుంది. తూ.గో జిల్లా కొన గ్రామంలో 165.34 ఎకరాల భూమిని ఏపీ మారీ టైమ్ బోర్డుకి ఎకరం రూ. 25 లక్షల చొప్పున విక్రయించే అంశంపై చర్చించారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 3148.68 ఎకరాల భూమిని ఎకరం రూ. 1.65 లక్షలకు విక్రయించే అంశంపై కెబినెట్లో సమీక్షా నిర్వహించారు.