నేడు ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతున్నది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ నేతృత్వంలో ఈ భేటీ జరగబోతున్నది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులను కూడా కేబినెట్ ఆమోదం తెలిపే ఆవకాశం ఉన్నది. అలానే, విశాఖ ఉక్కు విషయంలో ప్రభుత్వ వ్యూహంపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. అంతేకాకుండా, విభజన హామీలు, ఉద్యోగుల పంపకం విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారని సమాచారం. కరోనా మహమ్మారి ఉదృతి తరువాత జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రాజధానుల అంశంపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.