న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించటంతో హెచ్చరికలు జారీ చేశారు. రిక్టార్ స్కేల్ మీద దీని తీవ్రత 7.3గా నమోదయ్యింది. శుక్రవారం తెల్లవారుజామున న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి తూర్పుగా భూకంపం సంభవించినట్లు పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ తరంగాలు ఏర్పడే అవకాశం ఉందని పీటీడబ్ల్యూసీ తెలిపింది. అమెరికన్ జియోలాజికల్ సర్వే ప్రారంభంలో ఈ భూకంపం తీవ్రతను 7.3గా పేర్కొన్నది. ఆ తరువాత దానిని 6.9కి సవరించింది. 10 కిలోమీటర్ల (6 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని తెలిపింది.