అందరిపైనా ఏదో ఒక రకమైనా ట్విట్స్ చేసే రామ్ గోపాల్ వర్మ సాధారణంగా ఎవరిని వదిలిపెట్టడు. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ పై కౌంటర్లు వేసాడు. అయితే ఈ మధ్యే హైదరాబాద్ మేయర్ గా కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు చేప్పట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు వర్మ. అందులో విజయలక్ష్మి ఎంతో ప్రేమగా కుక్కకు చపాతీలు తినిపిస్తుంది. అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తూ వర్మ... ఈ వీడియోలోని భావోద్వేగాలను చూస్తే నాకు హైదరాబాద్ మేయర్ పై అనుమానం కలుగుతుంది. ఆమె తన కుటుంబం, పార్టీ, కేసీఆర్ మరియు తెలంగాణ ప్రజలు కంటే కూడా 1% ఎక్కువగా కుక్కను ప్రేమిస్తున్నారు. ఇది చూసి ఖచ్చితంగా వారందరూ ఈ కుక్క పట్ల అసూయపడుతున్నారు. మరి ఆమె తన కుక్కలాగే ప్రజలను ప్రేమిస్తుందా...? నా తదుపరి జన్మలో నేను కుక్కగా పుట్టాలని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే... హానరబుల్ మేయర్ కుక్కకు కుడి చేతితో తినిపిస్తూ ఆమె ఎడమ చేతితో తినడం'' అని వర్మ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్విట్స్ వైరల్ అవుతున్నాయి.