టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. అతడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శ్రీవిష్ణు తాజాగా నటించిన సినిమా గాలి సంపత్. సరికొత్త కథతో డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు అనిష్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించగా లవ్లీ సింగ్ హీరోయిన్ పాత్రలో అందరినీ అలరించేందుకు సిద్దమవుతున్నారు. వీరితో పాటుగా రఘుబాబు, తనికెళ్ల భరణి, సత్య, శ్రీకాంత్ అయ్యంగర్ తదితర ముఖ్య పాత్రల్లో కనిపిచంనున్నారు. అయితే నేడు ఈ సినిమా నుంచి ‘పాప ఓ పాప.. నీ పేరు తలచి నేను మజునునయ్యానే’ అంటూ సాగే పాట విడుదల అయింది. ఈ పాటను రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సాట ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాటలో శ్రీవిష్ణు లుక్స్, డాన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని మూవీ టీమ్ నమ్మకంగా ఉంది. ఈ చిత్రం మార్చి11న విడుదల కానుంది.