మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమా తరువాత తను చేసే సినిమాల విషయంలో చెర్రీ జాగ్రత్త వహిస్తున్నారు. కథలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తూ తన తదుపరి సినిమాను దర్శకుడు శంకర్‌తో ఓకే చేసిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో రానున్న సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ కాంబో మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్‌కు తెలుగు, హిందీలో మంచి మార్కెట్ ఉంది. నిజానికి శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఇండియన్2 కోసం రకుల్ ఇచ్చిన కాల్షీట్స్ను ఈ సినిమాకు వినియోగించుకోవాలని శంకర్ చూస్తున్నారంట. ఈ మేరకు వార్తలు కోలీవుడ్‌లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్‌కు ఫోటో షూట్లు కూడా నిర్వహించారంట. మరి ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ఫిక్స్ అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.