పూజా హెగ్దె ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలను చేస్తున్నారు. అమ్మడు తాజాగా ఓకే చేసిన సినిమా విజయ్ 65. ఈ సినిమాకి పేరు ఇంకా ఫిక్స్ కాలేదు. ముందుగా ఈ సినిమాకి కన్నడ బ్యూటీ రష్మికను అనుకున్నారంట కానీ రష్మిక డేట్స్ కుదరకపోవడంతో ఆ అవకాశం పూజాను వరించింది. ఈ సినిమా కోసం పూజా హెగ్దె ఓ తెలుగు సినిమాను త్యజించారు. ఈ సినిమాకి పూజా అందుకుంటున్న పారితోషికంపై తాజాగా కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అమ్మడి కెరీర్లోనే అత్యంత ఎక్కువ పారితోషికాన్ని ఈ సినిమాకి అందుకుంటున్నారని టాక్ నడుస్తోంది. విజయ్65 సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. కాబట్టి తెలుగులో మంచి మార్కెట్‌తో పాటు హిందీలోనూ ఓ మోస్తరు మార్కెట్ ఉన్న పూజాను సినిమాలోకి తీసుకొస్తే మంచిదని మేకర్స్ భావించారంట. అందుకే అమ్మడికి దాదాపు రూ.3.5 కోట్ల పారితోషికం ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ విషయంలో ఎటువంటి అధికారిక లెక్కలు తెలీవు. త్వరలోనే ఈ వార్తలపై పూజా స్వయంగా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే విజయ్ 65 సినిమాని ఎక్కువ శాతం రష్యా, చైనా దేశాల్లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.