బిగ్ బాస్ తెలుగు సీజన్లో తెలుగు ఫైనలిస్ట్, నటి హరితేజ నిన్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని హరితేజ సోషల్ మీడియా ద్వారా “ఇట్స్ ఎ బేబీ గర్ల్” అంటూ స్వయంగా వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో హరితేజకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హరితేజ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా బుల్లితెర నటీనటులు శిల్పా చక్రవర్తి, ప్రియతం, ఆకర్ష్ బైరాముడి, సుష్మా కిరణ్, చైత్రా రాయ్ తదితర ప్రముఖులు తమ శుభాకాంక్షలు పంపారు. కెరీర్ మొదట్లో హరితేజా మనసు మమత అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు షోలలో, సినిమాలలో కూడా నటించింది.