టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ఆర్జీవీ దెయ్యం' అంటూ హర్రర్ జోనర్లో మరో సినిమాని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో డా. రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు నటించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలకు సిద్దమవుతోంది. కాగా రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా 'RGV దెయ్యం' ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగే ఈ సినిమా ఆర్జీవీ స్టైల్లోనే ఉత్కంఠభరితంగా సాగుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.