ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌లో గత రికార్డులను బ్రేక్ చేస్తూ.. కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. తాజాగా, కేరళ సీఎం పినరయి విజయన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. సీఎంకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. అయితే, గత నెల 3వ తేదీన వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నరు కేరళ సీఎం.. కానీ, తాజాగా నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో మాత్రం.. కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు పినరయి విజయన్.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఎల్డీఎఫ్ అభ్యర్థులను మరోసారి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.. ఈ నెల 6వ తేదీన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. వచ్చే నెల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.