ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప : ది రైజ్" మూవీ నార్త్ బెల్ట్ లో చారిత్రాత్మక విజయం సాధించగా, మేకర్స్ తో పాటు చిత్రబృందం మొత్తం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మరో బ్లాక్ బస్టర్ "అల వైకుంఠపురములో" హిందీ డబ్బింగ్ వెర్షన్ ను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. జనవరి 26న థియేటర్లలో ఈ సినిమా హిందీ వెర్షన్ ను విడుదల చేయబోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సెన్సేషనల్ హిట్ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే 'పుష్ప' హిందీ వెర్షన్‌ను విడుదల చేసిన AA ఫిల్మ్స్, గోల్డ్‌మైన్ టెలిఫిలిమ్స్ ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' అద్భుతమైన విజయం సాధించడంతో ఇప్పుడు "అల వైకుంఠపురములో" కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నారు.