ప్రముఖ దక్షిణ భారత నటి ప్రియమణి "ది ఫ్యామిలీ మ్యాన్"తో డిజిటల్ స్పేస్‌లో మంచి పేరును సంపాదించుకుంది. ఇప్పుడు ఈ జాతీయ అవార్డు గ్రహీత "భామాకలాపం"తో తెలుగు OTTలోకి అడుగు పెడుతోంది. ఆహాలో ప్రసారం కానున్న ఒక రుచికరమైన ఇంట్లో వండిన థ్రిల్లర్ "భామాకలాపం"తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. తాజాగా "భామాకలాపం" గ్లింప్స్ విడుదలైంది. ఇందులో ప్రియమణి యూట్యూబ్‌లో మిలియన్ సబ్స్క్రైబర్లు, 1000 వంటకాలతో ప్రముఖ చెఫ్‌గా కన్పించింది. ఇన్ని రోజులు కూరగాయలు, మాంసాహారం తరిగి రుచికరమైన వంటకాలు చేసిన ఆమెకు అనుకోని పరిస్థితి ఎదురైనట్టు ఆ వీడియోలో వెల్లడించారు. అయితే అసలు విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. ఈ వెబ్ ఒరిజినల్ మూవీకి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించగా, చిత్రనిర్మాత భరత్ కమ్మ షోరన్నర్‌గా ఉన్నారు. సుధీర్ ఈదర, బోగవల్లి బాపినీడు ఈ చిత్రాన్ని SVCC డిజిటల్ పై "భామాకలాపం"ను నిర్మించారు.