"సర్కారు వారి పాట" అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా చాలా కాలంగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు మేకర్స్ ఇప్పుడు మొదటి సింగిల్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న "సర్కారు వారి పాట" ఫస్ట్ సాంగ్ రాబోతోంది. చిత్ర సంగీత దర్శకుడు థమన్ ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ “మా ప్రియమైన సూపర్‌స్టార్ మహేష్ పై నా ప్రేమ, కృతజ్ఞత, గౌరవాన్ని చూపించడానికి చాలా కాలం వేచి ఉన్నాను. ఫిబ్రవరి14న 'సర్కారు వారి పాట' ఫస్ట్ సింగిల్" అంటూ చెప్పుకొచ్చాడు. థమన్, మహేష్ ఇద్దరూ ఇంతకు ముందు దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు చిత్రాలకు కలిసి పని చేశారు. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ అవుతోంది. దీంతో ఈ మ్యూజిక్ ఆల్బమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.