నవరత్నాల ద్వారా అభివృద్ధి ఫలాలు అందరికి అందుతున్నాయని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ అన్నారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. డీబీటీ ద్వారా ఇప్పటి వరకు 1,67,798 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు క్షేత్ర స్థాయిలో విత్తన, ఎరువుల సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 19,126 కోట్లు రైతు భరోసా ద్వారా ఆర్ధిక సాయం అందించినట్టు తెలిపారు.అమూల్ పాల వెల్లువ ద్వారా 9,899 పాల కేంద్రాల ద్వారా పాల సేకరణ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 3177 కోట్ల వ్యయంతో 4 ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందన్నారు. విద్యను భవిష్యత్‌కు పాస్‌పోర్టుగా ప్రభుత్వం భావితస్తోందన్నారు. ఇప్పటి వరకు 34,619 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
మనబడి నాడు నేడు ద్వారా దశల వారిగా పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబసష్ను అమలు చేస్తున్నామన్నారు. అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది లబ్ధి దారులకు 13,023 కోట్లు చెల్లించామన్నారు. ఆరోగ్య పరిరక్షణకు గ్రామ స్థాయిలో 10,032 వైఎస్సార్ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2,466 జబ్బులకు చికిత్స విధానాలు అందిస్తున్నామన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లలోని 138 ఆస్పత్రుల్లో ను ఆరోగ్యశ్రీ పథకాన్ని అందజేస్తున్నాయని తెలిపారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు 3.2 కోట్ల నిర్థారణ పరీక్షలు చేసిందని గవర్నర్ వెల్లడించారు. జనవరి 21 తేదీ నాటికి 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తియినట్టు తెలిపారు.15-18 ఏళ్ల వయసు ఉన్న వారికి 93 శాతం మేర వ్యాక్సిన్ పూర్తి చేశారన్నారు. పెన్షన్ కానుక ద్వారా విడతల వారిగా 3 వేలకు పెన్షన్ అందించటం మా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇప్పటి వరకు 45,837 కోట్లు లబ్ధిదారులకు అందించాం. జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ద్వారా 25 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం 13 వేల కోట్లు వ్యయం చేయాలని భావిస్తోందన్నారు. 2023 కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తాగు సాగు నీటి కోసం 74,920 కోట్ల తో ప్రాధాన్యత క్రమంలో 54 కొత్త ప్రాజెక్టులు ప్రభుత్వం చేపడుతుంది.రివర్స్ టెండర్ల ప్రక్రియ ద్వారా 2088 కోట్లు అదా అయ్యిందన్నారు. ఉద్యోగుల సంక్షేమం మా ప్రభుత్వ ప్రాధాన్యతని పేర్కొన్నారు.11 వ పీఆర్సీ లో భాగం గా 23 శాతం పీఆర్సీ ని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచింది
సంక్షేమ ఫలాలు పేద ప్రజలతో పాటు ఉద్యోగులకు చెందాల్సిన అవసరం ఉంది.13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఉగాది నాటికి కొత్త జిల్లాల సాకారం అవుతాయి.రెండు జిల్లాలు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లా లుగా ఉంటాయి. సమీకృత అభివృద్ధి కోసం , పౌర సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందని గవర్నర్ తెలిపారు.