మలయాళీ నటి సంయుక్త మీనన్ పవన్ కళ్యాణ్, రానాల క్రేజీ మల్టీస్టారర్ "భీమ్లా నాయక్"తో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్లో ఆమె రానా భార్యగా నటించింది. ఇప్పుడు 'భీమ్లా నాయక్' సినిమా విడుదల కాకముందే సంయుక్త మరో బిగ్ ప్రాజెక్ట్ లో అడుగు పెట్టిందని వినికిడి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ 'SSMB28'లో రెండవ మహిళా ప్రధాన పాత్ర కోసం సంయుక్త ను త్రివిక్రమ్ ఎంపిక చేయడానికి ఆసక్తిగా ఉన్నారని, ఆమె త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంతకం చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ధనుష్ 'సర్' సినిమాతో బిజీగా ఉంది సంయుక్త. ఇప్పుడు ఆమెకు మరో బిగ్ ఆఫర్ దక్కినట్టు కన్పిస్తోంది.