అడుగడుగునా మోసం. ఆదమరిస్తే అంతే సంగతులు. మీ ఫోన్ కి వచ్చే అపరిచిత ఫోన్ కాల్స్ కి మీరు ఆన్సర్ చేశారంటే అంతే సంగతులు. బ్యాంకు సిబ్బంది పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ మీ అకౌంట్ ని ఖాళీ చేయగలదు. ఎస్బీఐ అకౌంట్‌కు చెందిన కేవైసీ అప్డేట్ చేయాలంటూ.. బ్యాంకు అధికారిగా ఓ మహిళకు ఫోన్ చేశారు కేటుగాళ్ళు.
కేవైసీ అప్డేట్ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని భయపెట్టిన చీటర్స్ మహిళను అడ్డంగా ముంచేశారు. బ్యాంకు వివరాలు అన్నీ తీసుకుని, మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని అడిగిన చీటర్స్ తమ పని కానిచ్చేశారు. అది చెప్పిన క్షణాల వ్యవధితో అకౌంట్లో నుంచి రూ.15లక్షలు కాజేశారు చీటర్స్.
ఇది మరో మోసం. స్టాక్మార్కెట్లో అధిక లాభాలంటూ 7లక్షల మోసం చేశారు. ఓ మహిళకు ఆన్లైన్ లో పరిచయమైన వ్యక్తి స్టాక్ మార్కెట్ లో అధిక లాభాలు ఇప్పిస్తానని నమ్మించాడు.7లక్షలు పెట్టుబడిగా పెట్టించి ఆ మొత్తాన్ని కాజేశాడు.లాభాలను చూసుకునేందుకు ప్రయత్నించగా..ఆ మహిళ మోసపోయానని తేరుకుంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.