తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం కలిగిస్తున్నాయి. డ్రగ్స్ కి సంబంధించి పోలీసులు కీలక చర్యలకు రంగం సిద్ధమయింది. డీజీపీ సమావేశం లో కీలక ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. డ్రగ్స్ అమ్మకందారులు, వినియోగదారుల చిట్టా తయారు చేసింది పోలీస్ శాఖ.
గతంలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్లతో చిట్టా సిద్ధం చేసింది పోలీస్ శాఖ. సినీ , రాజకీయ, వ్యాపార వేత్తలు, విద్యార్థుల సంబంధించిన పేర్లతో చిట్టా సిద్ధం చేశారు. డ్రగ్స్ తో పాటుగా గంజాయి తీసుకున్న వారి వివరాలను పొందుపరచిన పోలీస్ శాఖ
డ్రగ్స్ విక్రయాలపై నిరంతర నిఘా కు కొత్త యాప్ ను రూపొందించిన పోలీస్ శాఖ. Dopam యాప్ లో డ్రగ్స్ క్రయ విక్రయదారులకు సంబంధించిన పూర్తి సమాచారంతో యాప్ రెడీ అయింది. డ్రగ్స్ కు సంబంధించి గత పదేళ్ల దాటాను తయారు చేసింది పోలీస్ శాఖ. డ్రగ్స్ విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో పోలీసులు కీలక చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు.