నాగ చైతన్య, సమంతా రూత్ ప్రభుల విడాకుల విషయం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. వీరిద్దరి గురించి ఈరోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిన్నటి నుండి నాగ చైతన్య, సమంతా రూత్ ప్రభుల విడాకుల సమస్యపై అనేక కథనాలు ఇంటర్నెట్ లో రచ్చ చేస్తున్నాయి. అందులో సమంత ముందుగా విడాకులు కోరిందని, నాగ చైతన్య మాత్రం తన గురించి ఆలోచించాడని, కుటుంబం పరువు గురించి భయపడ్డాడు అని వార్తలు వచ్చాయి. దీంతో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ట్విటర్ వేదికగా ఈ వ్యాఖ్యలను కొట్టి పారేశారు. సమంత, నాగచైతన్య గురించి నేను చేసిన ప్రకటనను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం, అసంబద్ధం!!" అని ఆయన ట్వీట్ చేశారు. దయచేసి పుకార్లను వార్తగా పెట్టడం మానుకోవాలని ఆయన మీడియా మిత్రులను అభ్యర్థించారు.