మెగాస్టార్ చిరంజీవి హనుమంతునికి పరమ భక్తుడన్న విషయం తెలిసిందే. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో క్లిప్‌లో రామ్ చరణ్ 'ఆచార్య' షూటింగ్ స్పాట్ లో ఉన్నారు. అక్కడ ఆయన మేకప్ వేసుకుంటుండగా, అనుకోకుండా అక్కడికి ఓ కోతి వచ్చింది. దీంతో ఆ కోతికి చెర్రీ బిస్కట్లు అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన 'ఆచార్య' ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. 'ఆచార్య'ను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.