యంగ్ హీరో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా మేకర్స్ టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి 'స్పై' అనే టైటిల్ ను ఖరారు చేయగా, ఫస్ట్ లుక్ పోస్టర్లో నిఖిల్ గన్ తో స్టైలిష్ గా కన్పిస్తున్నారు. టైటిల్ కు తగ్గట్టుగానే సినిమాలో నిఖిల్ స్పై గా కన్పించబోతుండగా, ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కోసం నిఖిల్ సరికొత్త మేకోవర్ లోకి చేంజ్ కాబోతున్నారు. మొత్తానికి నిఖిల్ మొదటి పాన్ ఇండియా మూవీ పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడీగా ఐశ్వర్యా మీనన్ నటిస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, జూలియన్ అమరు ఎస్ట్రాడా కెమెరా బాధ్యతలు చేపడుతున్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మూవీని నిర్మిస్తున్న నిర్మాత కే రాజ శేఖర్ రెడ్డి ఈ చిత్రానికి కథ కూడా అందించారు.