యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ యాక్టర్ విశ్వక్ సేన్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ "దాస్ కా దమ్కీ" షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు విశ్వక్ హీరోగా నటించిన "అశోక వనంలో అర్జున కళ్యాణం" అనే మరో సినిమా విడుదల కావాల్సి ఉంది. ఏప్రిల్ 22న విడుదల కావలసిన ఈ సినిమాను వాయిదా వేసిన మేకర్స్ తాజాగా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ రోజు రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే 6న థియేటర్లలో విడుదలవుతుందని ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో రుక్సార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్విసిసి డిజిటల్ బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. మరి మే 6న రిలీజ్ కానున్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.