విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన F3 ఫస్ట్ సాంగ్ ఇప్పటికే విడుదలై మంచి ఆదరణను దక్కించుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా ఏప్రిల్ 22న టీమ్ ఈ సినిమా నుంచి రెండవ సింగిల్ 'ఊ ఆ ఆహా" అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. F3 చిత్రం మే 27న థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధంగా ఉంది.