"సర్కారు వారి పాట" టీం తాజాగా ఓ అప్డేట్ ను షేర్ చేసింది. కొద్ది రోజుల క్రితం 'సర్కారు వారి పాట' మేకర్స్ ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిందని, త్వరలో ఈ సాంగ్ ను పూర్తి చేయబోతున్నామని ప్రకటించారు. టీమ్ నుండి వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం, ఈ చివరి పాట షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇది మరో రెండు రోజులు కొనసాగుతుంది. ఈ మాస్ సాంగ్ పూర్తయితే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోందని, సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఇటీవల ప్రకటించిన విధంగానే మే 12న సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.