మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆచార్య'. ఏప్రిల్ 29న రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, అవి ఆకాశాన్ని తాకేలా ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు "ఆచార్య" చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు వాయిస్‌తో సినిమా ప్రారంభం కానుందని, కథను ప్రేక్షకులకు పరిచయం చేసేది మహేషే అని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం కొరటాల శివ మెగాఫోన్ పట్టడంతో పాటు, 'ఆచార్య'కి స్క్రిప్ట్ కూడా రాశారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే 'ఆచార్య'లో కథానాయికలుగా నటిస్తుండగా, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు.