"కన్మణి రాంబో ఖతీజా" (KRK) చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ రొమాంటిక్ కామెడీలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా మారింది. ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడడం, ఇరువురు భామల మధ్య విజయ్ సేతుపతి నలిగిపోవడం అనే అంశాలను ఫన్నీ వేలో ఆసక్తికరంగా చూపించారు. కన్మణి ఖతీజాను కలిసిన తర్వాత కథలో వచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంది. మూవీ ఖుషి, టైటానిక్, బాహుబలి స్పూఫ్లతో కూడా లోడ్ అయ్యింది. ఆసక్తికరమైన కథాంశం, కథనంతో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా, 7 స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.