"సర్కారు వారి పాట" ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, ఈరోజు ఈ చిత్రంలోని మూడో పాటను విడుదల చేశారు మేకర్స్. "సర్కారు వారి పాట" అంటూ సాగిన ఈ టైటిల్ సాంగ్ ను హారిక నారాయణ్ పాడారు. ఇది సినిమాలో మహేష్ ఇంట్రడక్షన్ నంబర్ అని లిరికల్ వీడియోను చూస్తుంటే అర్థమవుతోంది. టైటిల్ సాంగ్ ట్యూన్ ఉల్లాసంగా, గానం భిన్నంగా ఉంది. అనంత శ్రీరామ్ సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. సాంగ్ లో మహేష్ యాటిట్యూడ్, యాక్షన్ బ్లాక్స్ చూపించే విజువల్స్ అదిరిపోయాయి. మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఉంది ఈ సాంగ్. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి హిట్ కాగా, ఈ పాట కూడా ఆకట్టుకుంటోంది. "సర్కారు వారి పాట" సాంగ్ మే 12న విడుదల కానుంది.