దేశం కోసం అసువులు బాసిన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'మేజర్'. ఈ మూవీని మే 27న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లోనే అదే రోజున జనం ముందుకు తమ సినిమా వస్తుందని నిర్మాతలు అన్నారు. అయితే అదే తేదీన వెంకటేశ్, వరుణ్ తేజ్ 'ఎఫ్ 3' మూవీ సైతం విడుదల అవుతోంది. దాంతో 'మేజర్'ను ఇప్పుడు ఓ వారం పోస్ట్ పోన్ చేసి జూన్ 3న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాను శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ముంబై అటాక్ లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'మేజర్'.