విభిన్నమైన సబ్జెక్ట్స్ అటెంప్ట్ చేస్తున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ మూవీ "భళా తందానానా"తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ అందించిన సంగీతం, మొదటి రెండు పాటల లిరికల్ వీడియోలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా టీజర్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత, సురేష్ రగుతు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్. భారతదేశపు టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షించారు. బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో దూకుడు పెంచారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్యాచీ సాంగ్ ను రిలీజ్ చేశారు. "పొద్దున్నే గ్రీన్ టీ... నైట్ అయితే నైంటీ" అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.