చిత్తూరు జిల్లాలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై దాడి సంచలనంగా మారింది. ఇళ్లు ఖాళీ చేయలేదని ఆగ్రహంతో ఎదురింటి వారే ఉద్యోగిపై గ్యాంగ్ గా ఏర్పడి దాడికి దిగారని బాధితుడు ఆరోపించారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. కొద్ది రోజులుగా పలమనేరు పాతపేట పోలీస్ లైన్ వీధిలో నివాసముంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిరంజన్ ను కొందరు గ్యాంగ్ గా ఏర్పడి దాడి చేశారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే నిరంజన్ ఇల్లు ఖాళీ చేయకపోవడంతో.. విచక్షణా రహితంగా కొట్టారు.
ఖాళీ చేయలేదనే ఉక్రోశంతో .. ఒకే వీధిలో కాపురం ఉంటున్న ఎదురెదురు ఇళ్ల మధ్య గొడవ దాడి చేసుకునేంత వరకు వచ్చించి. సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై దాడి చేసేందుకు ఎదురింటి వ్యక్తులే కొందరు గ్యాంగ్ ను ఉపయోగించారని బాధితుడు మీడియాకు వివరాలు తెలిపాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిరంజన్ ను దాడి చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డ్ అవడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. కేవలం ఇళ్లు ఖాళీ చేయలేదని ఇలా గ్యాంగ్ గా ఏర్పడి దాడి చేస్తారా అంటూ కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్థానిక సమాచారంతో.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.