రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ “నవ సంకల్ప్ శిబిర్” సమావేశాల కోసం హోర్జింగ్ లు ఏర్పాటు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర పటంతో పాటు, జాతీయ నాయకులు, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తదనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన మంత్రులైన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, డా. మన్మోహన్ సింగ్ చిత్రపటాలతో హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు.
అలాగే దేశ భక్తులు రవీంద్రనాధ్ ఠాగూర్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్, సరోజనీ నాయుడు చిత్ర పటాలతో హోర్జింగ్ లు వున్నాయి.సభా స్థలిలో భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, బాల గంగాధర్ తిలక్ చిత్రపటాలు కనిపించాయి.
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే, బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలతో కూడా హోర్డింగ్ లు పెట్టారు. ఈ శిబిర్లో పీవీ నరసింహారావు చిత్ర పటం కనిపించకపోవడంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. పీవీ నరసింహారావు క్యాబినెట్ లో ఆర్దిక మంత్రి గా పనిచేసిన డా.మన్మోహన్ సింగ్, తదనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ-1, యుపిఏ-2 లో ప్రధాన మంత్రి గా పనిచేశారు. డా. మన్మోహన్ సింగ్ చిత్రపటాలతో హోర్జింగ్ లు ఉన్నా, పీవీ నరసింహారావు చిత్ర పటం తో హోర్డింగ్ లు మాత్రం లేవు. ఉదయ్ పూర్ లో జరుగుతున్న “నవ సంకల్ప్ శిబిర్” సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రియాంక గాంధీ కి ఆత్మీయ స్వాగతం లభించింది.