చేనేత ద్రోహి సీఎం కేసీఆర్ : బండి సంజయ్‌

0
178

ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించగా.. ఇటీవల మూడో దశ పాదయాత్రను ప్రారంభించారు బండి సంజయ్‌. అయితే.. ఈ నేపథ్యంలో నేడు పాదయాత్రలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా బీజేపీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం చేనేత కార్మికుల బతుకులు దేనియంగా ఉన్నాయి. మా రాష్ట్రం మాకు వస్తే మాబ్రతుకులు బాగుపడతాయి అనుకుంటే మరింత దయనీయంగా పరిస్థితులు మారిపోయాయి. చేనేత కార్మికులకు చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కూడా చెప్పలేని దయని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. చేనేత ద్రోహి కేసీఆర్.. ఏ ప్రాంతంలో ఏ కులం వారు ఎక్కువగా ఉంటే వారికి అనుకూలంగా మాట్లాడుతాడు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్రాన్ని ఎవరు ఊహించలేరు.. ప్రొఫెసర్ జయశంకర్ బ్రతికి ఉన్నప్పుడు ఆయనను అడుగడుగున అవమానించాడు ముఖ్యమంత్రి కేసీఆర్.

 

ఆయన అవమానించిన కేసీఆర్ కు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు.. ప్రొఫెసర్ జయశంకర్ సర్ మృతికి ముఖ్యమంత్రి కారణం. ప్రస్తుత చేనేత కార్మికుల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చేనేత కార్మికులకు పెళ్లికి పిల్లను ఇచ్చే పరిస్థితి లేదు. నూలు సబ్సిడీ లేదు.. చేనేత బంధు లేదు.. చేనేత బీమా ప్రస్తావనే లేదు.. చేనేత బీమాను ఎందుకు అమలు చేయడం లేదు..రాష్ట్రంలో 360 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోలేని ముఖ్యమంత్రి.. మన డప్పు తీసుకువెళ్లి పంజాబ్ లో రైతులను ఆదుకోవడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మగ్గాలకు జియో టాగ్ ఇస్తాము. చేనేత వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇల్లు లేని చేనేత కార్మికులందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తాం. ప్రపంచానికి తెలంగాణ చేనేత కార్మికుల గొప్పతనాన్ని చాటిన ఘనత ప్రధాని మోదీ దే. కేంద్రం ఏడు టెక్స్ టైల్ పార్కులను మంజూరు చేస్తే…. తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేయడంతోనే ప్రజా సంగ్రామా యాత్ర ప్రారంభించాము.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here