హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యం : బండి సంజయ్‌

0
107

ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. అయితే నేడు నాగోల్‌లో ప్రజా సంగ్రామ యాత్రలో సాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. 2040 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసిందన్నారు. ఎంఐఎం కనుసన్నల్లో పీఎఫ్ఐ నడుస్తోందని, జిమ్, స్వచ్ఛంద సంస్థల పేరుతో పీఎఫ్ఐ విస్తరిస్తోందని ఆయన ఆరోపించారు. పీఎఫ్ఐను టీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని, హిందువుల తలలు నరుకుతున్న పీఎఫ్ఐ సంస్థ తెలంగాణలో విస్తరిస్తుంటే కేసీఆర్ కు సిగ్గు లేదా? ఎన్ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి సర్కార్ కు సోయి ఎందుకు లేదు? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమేనని, హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యమన్నారు. కేంద్రం ఇండ్లు మంజూరు చేసినా లెక్క చెప్పని కేసీఆర్.. భూములున్నా పట్టాలివ్వని దుర్మార్గుడని ఆయన మండిపడ్డారు.

 

రిజిస్ట్రేషన్ల బంద్ తో నానా అవస్థలు పడుతున్న వేలాది మంది బాధితులు.. కేసీఆర్ కుటుంబానికి లంచాలిస్తే తప్ప పనులు కాని దుస్థితి ఉందని ఆయన అన్నారు. కుక్క తోక వంకర తరహా కేసీఆర్ తీరు ఉందని, ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లను అరెస్ట్ చేసి జైళ్లో పెడతారా? అని ఆయన ధ్వజమెత్తారు. ఏ స్కాం చూసినా కేసీఆర్ కుటుంబానిదే పాత్ర అని, కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న కేసీఆర్…. లిక్కర్ స్కాంపై నోరెందుకు మెదపవు? సీబీఐ, ఈడీ దాడులు చూసి క్వారంటైన్ పోతున్న కేసీఆర్ కుటుంబం. సీఎం కుటుంబాన్ని తెలంగాణ పొలిమెర దాటేదాకా తరిమి తరిమి కొట్టేదాకా విశ్రమించబోమని ఆయన అన్నారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండని ఆయన వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here