రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమే : బండి సంజయ్‌

0
134

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 2 దఫాలుగా పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్‌ ఇటీవల యాదాద్రి నుంచి మూడో దశ పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. నేడు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మూడో దశ పాదయాత్ర ముగించనున్నారు. అయితే.. మూడో దశ ప్రజసంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని, అనుమతితోనే పాదయాత్ర చేస్తున్నామని, అయినా నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు?. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉందనే… ప్రజల దృష్టి మళ్లించేందుకే నన్ను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్… మోడీని తిడుతున్నారని, లిక్కర్ స్కామ్ లో తన కుటుంబానికి ప్రమేయం ఉందా..? లేదా…? కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

 

కేసీఆర్ అవినీతి అంతా బయటికి తీస్తున్నామని, సీతమ్మ, రాముల వారిని తిట్టిన మునావర్ ఫారాఖీకి హైదరాబాద్ లో అనుమతి ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే… మునావర్ ఫారాఖీ ని రప్పించారని, మునావర్ ఫారాఖీకి 2000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తారు. పాదయాత్ర చేస్తున్న మనకు మాత్రం భద్రత ఇవ్వరు. స్ట్రాటజీలో భాగంగానే.. బీజేపీ ని బూచి గా చూపిస్తూ… మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నాడు కేసీఆర్. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోడానికే… మత ఘర్షణలు సృష్టించి, రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడు. హిందూ దేవుళ్లను, దేవతలను కించపరిచిన మునావర్ ఫారాఖీ కి అనుమతి ఎలా ఇస్తారు?. గుంట నక్కలు ఏకమయ్యారు.. బీజేపీ సింహం… సింగిల్ గా వస్తుంది.. బీజేపీ అంటేనే కేసీఆర్ గజగజ వణుకుతున్నాడు.. కేసీఆర్ ను ఇంకా వనికిద్దాం. యుద్ధం ప్రకటించాం.. 8వ నిజాం కేసీఆర్… కేసీఆర్ తో యుద్ధానికి, బల ప్రదర్శన కు మేము సిద్ధం.. పోలీసు వ్యవస్థకు బీజేపీ వ్యతిరేకం కాదు.. కొంతమంది అధికారులు పోస్టుల కోసం కానిస్టేబుళ్లను హింసిస్తున్నారు. అభివృద్ధి కోసం కేసీఆర్ తో చర్చకు బీజేపీ సిద్ధం.. హిందూ గాళ్ళు, బొందు గాళ్ళు అంటే… కరీంనగర్ లో బొందపెట్టాం.. బీజేపీ అధికారంలోకి వస్తే… ఉచిత విద్య, వైద్యం ఇస్తాం.. ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తాం.. ఫసల్ బీమా యోజనను అమలు చేస్తాం.. అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తాం. “ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు” ఇస్తాం.. అందరం కలిసి యుద్ధం చేద్దాం.. కేసీఆర్ అడుక్కుని చప్పట్లు కొట్టించుకునే పరిస్థితి కి దిగజారాడు.. కేసీఆర్ గడీల బద్దలు కొడతాం.. కేసీఆర్ కుటుంబానికి రోజులు దగ్గర పడ్డాయి.. కేసీఆర్ కు దమ్ముంటే యుద్ధానికి రా.. యాత్రను అడ్డుకోవడం కాదు… 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రను సెప్టెంబర్ 12న ప్రారంభిస్తాం.. దమ్ముంటే నా 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకో.. బాధ్యతాయుతంగా ప్రజల కోసం “ప్రజా సంగ్రామ యాత్ర” చేస్తాం.. బీజేపీ కార్యకర్తలైన మహేష్, నగేష్, శ్రీరాములు కాళ్ళు విరిగాయి’ అంటూ బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here