ఇంటికి తాళం వేస్తే చాలు.. దొంగలు రెచ్చిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ ఇంట్లో చోరీ జరిగింది. 30 లక్షల వరకు విలువచేసే బంగారం, నగదు చోరీ చేశారు దుండగులు
ఈనెల 19 వ తేదీన కంచి కామాక్షి దేవాలయానికి దర్శనానికి వెళ్లారు మాజీ సర్పంచ్ రవీందర్ కుటుంబం. దేవాలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బంగారం, నగదు దోచుకెళ్లిపోయారు దుండగులు. నిన్న బాధితుడు రవీందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పటాన్చెరు పోలీసులు. చోరీ జరిగిన ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించింది క్లూస్ బృందం.