నిత్యం భక్తులతో రద్దీగా వుండే తిరుమలలో లగేజీ కౌంటర్ వద్ద కూలిపోయింది భారీ వృక్షం..చెట్టు కొమ్మ ఇన్నోవా కారుపై పడడంతో పాక్షికంగా ధ్వంసం అయింది…భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది..యుద్ధప్రాతిపదికిన చెట్టును తొలగించారు అటవీ సిబ్బంది. ఈ వేకువజామున వీచిన భారీ గాలులకు తిరుమలలోని లగేజీ కౌంటర్ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది.చెట్టు కూలిన సమయంలో అక్కడ భక్తులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.చెట్టు కూలిన సమయంలో ఓ కొమ్మ ఇన్నోవా వాహనం పై పడడంతో ఇన్నోవా పాక్షికంగా ధ్వంసమయ్యింది.ఆ సమయంలో వాహనంలో భక్తులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.రోడ్డు పై భారీ వృక్షం నేలకొరగడంతో టీటీడీ అటవీ సిబ్బంది క్రేన్ల సహాయంతో యుద్ధ ప్రాతిపదికిన చెట్టును తొలగించారు.
మరోవైపు తిరుమలకు భక్తులు పోటెత్తారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల వున్న క్యూ లైన్లు.. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు 40 గంటలు పడుతున్న దర్శన సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57,104 మంది భక్తులు…తలనీలాలు సమర్పించిన 32,351 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లుగా టీటీడీ తెలిపింది.కార్తీకమాసం సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా వుంది.