మందుబాబులకు రాజభోగమే.. ఏసీ రూంలు, కాపలాకి కుక్కలు ఆహా..!

0
73

సాధారణంగా తాగుబోతులంటే అంతా చులకనగా చూస్తారు. ప్రభుత్వాలకు ఆదాయాన్ని తెచ్చేది.. వాటిని నడిపించేది తాగుబోతులే. ఎక్సైజ్ శాఖకు ఉన్నంత ఆదాయం మరే శాఖకు ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అందువల్లే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యం బాబులను నెత్తిన పెట్టుకుంటున్నాయి. అలాంటిదే ఈ సంఘటన.. సంపూర్ణ మద్య నిషేధం ఉన్న రాష్ట్రం బీహార్ లో మందుబాబులకు ఏసీ రూముల్లో రాజమర్యాదలు చేస్తోంది ప్రభుత్వం. అదేంటో మద్య నిషేధం అని ప్రకటించి మద్యం తాగితే చర్యలు తీసుకోకుండా ఈ మర్యాదలేంటీ? అనే డౌట్ వస్తుందా..? అంతేకాదు మందుబాబులకు బీహార్ ఎక్సైజ్ శాఖ మందుబాబులకు చేసే రాచమర్యాదల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

బీహార్‌లో 2016 ఏప్రిల్ నుంచి మద్య నిషేధం అమలులో ఉంది. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం సీఎం నితీశ్ కుమార్ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసేలా చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం ఎవరైనా మద్య తాగి పట్టుబడితే మొదటిసారి ఫైన్ వేసి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. రెండోసారి చిక్కితే కఠిన చర్యలుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఎవరైనా మద్యం తాగి పట్టుబడితే చర్యలు తీసుకోవటం మాట పక్కన పెడితే వారిని ఏకంగా ఏసీ రూముల్లో ఉంది సకల మర్యాదలు కల్పిస్తోంది. ఓ పక్క మద్యపాన నిషేధం అంటూ మరోపక్క మందుబాబులకు స్టార్ హోటర్ ఫెసిలిటీస్ కల్పించటం ఏంటీ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు.. పలుకుబడి ఉన్న వ్యక్తులు రోడ్లపై తాగి ఎక్కడపడితే అక్కడ తిరగకుండా.. వార్డులోనే మద్యం మత్తు దిగేదాకా ఉండొచ్చని సూచించింది. వారి కోసం 24 గంటల పాటు బెడ్లు, దుప్పట్లతో పాటు ఏసీలను ఏర్పాట్లు చేయడమే కాకుండా వారిని కాపలా కాయడానికి ఓ శునకాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు.

మద్యం తాగుతు పట్టుబడి వీఐపీల కోసం ఏర్పాటు చేసిన ఏసీ రూములు చూస్తే అవాక్ అవ్వాల్సిందే. అరెస్ట్ చేసి ఉంచాల్సి సెల్ ను స్టార్ హోటల్ లాగా మార్చేసారు. ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతేకాదు వారి సెక్యూరిటీ కోసం ట్రైన్డ్ డాగ్ ను కూడా కాపలాగా ఉంచుతున్నారు. అరెస్ట్ అయిన వీఐపీలు ఈ ఏసీ రూముల్లో 24 గంటలు ఉండాలని చెబుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ తరువాత వారికి ఫైన్ వేసి వదిలేస్తామంటున్నారు. వీఐపీల విషయంలో ఎక్సైజ్ శాఖ వ్యవహారంపై పలు విమర్శలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here