బీజేపీ సామాజిక న్యాయ వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలు ఈ నెల 14 వరకు కొనసాగుతాయని బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ మేరకు వారోత్సవాలకు సంబంధించిన బీజేపీ నేతలకు, కార్యకర్తలకు పలు సూచనలు చేస్తూ ప్రకటనను విడుదల చేశారు. 06.04, 2023 – “పార్టీ ఆవిర్భావ దినోత్సవం”. వాల్ రైటింగ్, జిల్లా, మండల, పోలింగ్ బూత్ అధ్యక్షులు వారి స్వహస్తాలతో వాల్ రైటింగ్. 7వ తేదీన సహపంక్తి భోజనాలు మరియు స్వచ్ఛతా కార్యక్రమాలు. BJYM ఆధ్వర్యం లో మండల స్థాయిలో నిర్వహించాలి. 08న జన జాగరణ ఉద్యమం. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లు మొదలైన సమాచారాన్ని విస్తృతంగా మండల స్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి (మైనార్టీ మోర్చా). 09న అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో, చిరుధాన్యాల వాడకం వలన కలిగే ఉపయోగాల గురించి ప్రజలకు, చిరుదాన్యాలు పండించడం మరియు గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించడం, చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడం. గిరాకీ ఉన్న పంటలు పండించేలా రైతులకు నచ్చజెప్పడం (కిసాన్ మోర్చా).. 10న సామాజిక కార్యకర్తలు, రచయిత్రులు, కళాకారిణులు, ఉపాధ్యాయినులు, అంగన్వాడీ కార్యకర్తలు వంటి దళిత మహిళలను ఆహ్వానించి, వారితో మండల స్థాయిలో సహపంక్తి భోజనాలు (మహిళా మోర్చా). 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమం రాష్ట్ర, జిల్లా స్థాయిలో బిజెపి, మండల స్థాయిలో OBC Morcha banner పై జరగాలి. అలాగే 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతున్న ‘పల్లె పల్లెకు ఓబీసి – ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం 9 సంవత్సరాలలో సాధించిన విజయాలు. ఓబీసీల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాల గురించిన పోస్టర్లు, కరపత్రాల వితరణ చేయాలి. 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు Medical Cell ఆధ్వర్యంలో, ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి. ముఖ్యంగా ఉమ్మడి రంగా రెడ్డి, హైదరాబాదు జిల్లాలలో అధిక సంఖ్యలో శిబిరాలు నిర్వహించేటట్లుగా యోజన చేయాలి.
13న మండల కేంద్రాల్లోని ప్రతి చెరువులోని నాచు, గుర్రపు డెక్క తొలగించి శుభ్రపరిచే కార్యక్రమం. ఇందులో బిజెపి నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలి చెరువుల వద్ద జాగ్రత్తగా పనులు చేయాలి. ఇంకా. దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ వంటి మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచి పూల మాలలు వేయాలి. అలాగే విగ్రహాల పరిసరాలను కూడా శుభ్రం చేయాలి. 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో బిజెపి, మండల, పోలింగ్ బూత్ స్థాయిలో దళిత మోర్చా బ్యానర్ తో కార్యక్రమం నిర్వహించాలి. Hall Meetings ఏర్పాటు చేయాలి. విగ్రహాలున్న చోట విగ్రహాలకు పూల మాల వేయాలి. లేని చోట, Hall Meetings లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేయాలి. దళిత మేధావుల ఉపన్యాసం, నరేంద్రమోడీగారి కేంద్ర ప్రభుత్వ పథకాలు, పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం పై చర్చ జరగాలి. ఈ కార్యక్రమం SC Morcha banner తో అన్ని మండలాలు, పోలింగ్ బూత్ లలో జరగాలి.’ అని బీజేపీ కార్యకర్తలకు అధిష్టానం సూచనలు చేసింది.