ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ చేసి,అధికారంలోకి వస్తామని తెలిపారు సోము వీర్రాజు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి విషయంలో కేటగిరీ-జి లో వుందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయల నిధులతో రోడ్లు వేస్తుంటే ,రాష్ట్రం 500కోట్ల రూపాయలు కూడా నిధులు ఖర్చు పెట్టడం లేదు. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి దారుణంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నడికుడి శ్రీ కాళహస్తి రైల్వే పనులకు ముందుకు వస్తుంటే ,రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు…రాష్ట్రంలో గృహ నిర్మాణాల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇళ్ళు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుంటే ,రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మాణం చేయడం లేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తోలు మందం ప్రభుత్వం.. కీలక విషయాల్లో స్పందించడం లేదన్నారు. కేంద్రం యొక్క చురుకుదన్నాని అందిపుచ్చుకోవడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. రాష్ట్ర రాజధాని విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు.
అవినీతి, కుటుంబ పరిపాలన మూలంగా రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారయ్యింది. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియాలతొ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక తీరప్రాంతం ఉన్న రాష్ట్రం,మరియు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, అత్యధిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ నుండి జరుగుతున్న బియ్యం రేషన్ మాఫియా దేశంలో ఎక్కడ జరగడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించకుండా బియ్యం మాఫియా నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు కుటుంబ పాలన సాగిస్తున్నాయన్నారు సోము వీర్రాజు.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో లక్షల కోట్ల అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుంటే, ఈ కుటుంబ పార్టీలు డబ్బు దండుకోవడానికే పరిపాలన సాగిస్తున్నారు. ఈ కుటుంబ పార్టీల పాలన అంతమోందించి ,దేశ బావిభారత ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో 2024 ఎన్నికల్లో విజయకేతనం ఎగురువేస్తామన్నారు.