ముద్దు పెట్టాడని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది..

0
52

Wedding: పెళ్లి మండపంలో పీటలపైనే వరుడు తనకు ముద్దు పెట్టాడని పెళ్లి చేసుకునేందుకు వధువు నిరాకరించింది. ఈ ఘటనతో పెళ్లికి వచ్చిన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మెడలో పూల మాల వేస్తున్న సమయంలో వరుడు.. వధువుకు ముద్దు పెట్టాడు. దీంతో వధువు ఆగ్రహానికి గురైంది. అతడితో పెళ్లి రద్దు చేసుకునేందుకు సిద్ధపడింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు వారి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. అక్కడ కూడా పెళ్లి కూతురి మాటే నెగ్గడంతో వివాహాం రద్దయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లా బహ్జోయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద బదాయూలోని బిల్సీకి చెందిన యువకుడికి బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నవంబర్ 26న వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాల అంగీకారం మేరకు మంగళవారం వరుడు అతడి కుటుంబ సభ్యులతో పాటు వధువు గ్రామానికి చేరుకున్నాడు. సామూహిక కళ్యాణోత్సవంలో వివాహం అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో గత సోమవారం గ్రామంలో కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వధువును తీసుకెళ్లేందుకు వరుడు పెళ్లి ఊరేగింపుతో అమ్మాయి గ్రామానికి చేరుకున్నాడు. వధువు తరఫు వారు పెళ్లి ఊరేగింపుతో పాటు ఇతర వివాహ ఆచారాలను నిర్వహించారు. ఇదిలా ఉండగా జయమాల సమయంలో వరుడు వధువుతో అసభ్యకర పనులు చేయడం ప్రారంభించాడు. పెళ్లి ఆచారాల్లో భాగంగా వధువు మెడలో మాల వేస్తున్న సమయంలో వరుడు ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. దీంతో కోపాద్రిక్తురాలైన ఆ యువతి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. అలా ఇరు వర్గాల మధ్య ఓ చిన్నపాటి గొడవ జరగగా విషయం పంచాయతీ వరకు వెళ్లింది. పంచాయతీలోనూ వధువు అదే మాట చెప్పడం వల్ల విషయం బజోయ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అయినా.. అతడ్ని పెళ్లి చేసుకునేందుకు వధువు ఒప్పుకోలేదు. దీంతో ఇరువర్గాల గొడవ మొదలైంది. వధూవరుల తరఫు వారు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. ఇంతలో ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివాదాన్ని ముగించారు. అయితే ఆగ్రహించిన వధువు వరుడితో వెళ్లేందుకు సున్నితంగా నిరాకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here