బీజేపీ నేత ఇంటికి బుల్డోజర్.. మహిళపట్ల అనుచితంగా ప్రవర్తించడమే కారణం..

0
146

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్.. స్టైలే వేరు.. ఆయన సీఎం అయిన తర్వాత యూపీలో చాలా వరకు నేరాలు, ఘోరాలు అదుపులోకి వచ్చాయని చెబుతారు… ఎవరైనా తప్పుచేస్తే.. ఆ ఇంటి ముందు వెంటనే బుల్డోజర్‌ దిగిపోతుంది.. అక్రమకట్టడాలు ఏమైనా ఉంటే కూల్చివేస్తుంది.. లేదా.. పూర్తిగా కూల్చివేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. అయితే, సీఎం యోగి.. తప్పుచేసినవాళ్లపైనే కాదు.. ప్రతిపక్షాలపై కూడా బుల్డోజర్‌ చర్యకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఇప్పుడు ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన నేతపైనే బుల్డోజర్‌ చర్యకు దిగడం ఆసక్తికరంగా మారింది.. తాజాగా, నోయిడా హౌజింగ్ సొసైటీలో ఓ మ‌హిళ‌పై స్థానిక బీజేపీ నేత అనుచితంగా ప్రవర్తించాడు.. ఆమెను దూషించి దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి… ఓ మహిళ పట్ల.. బీజేపీ నేత శ్రీకాంత్‌ త్యాగి వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో రచ్చ చేసింది.. అయితే, ఇవాళ అధికారులు బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటి వ‌ద్ద ఉన్న అక్ర‌మ నిర్మాణాన్ని కూల్చివేయడం చర్చగా మారింది..

ఇవాళ ఉదయం నోయిడా హౌజింగ్ సొసైటీకి బుల్డోజ‌ర్ రావ‌డంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.. చ‌ప్ప‌ట్లు కొట్టారు. సీఎం యోగి నిర్ణ‌యం ప‌ట్ల హర్షం వ్యక్తం చేశారు.. కాగా, నోయిడా సెక్ట‌ర్ 93బీలో నివ‌సిస్తున్న ఓ మ‌హ‌ళ‌తో బీజేపీ నేత త్యాగి అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ ఘ‌ట‌న‌లో ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.. శ్రీకాంత్ త్యాగి ప్రస్తుతం ప‌రారీలో ఉండగా.. అక్ర‌మంగా సొసైటీ పార్క్‌ను క‌బ్జా చేసిన త్యాగిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నోటీసులు ఇచ్చినా ప‌ట్టించుకోకుండా.. అక్ర‌మ నిర్మాణాన్ని చేపట్టడంతో.. ఓ మహిళ ప్రశ్నించింది.. ఆమెను నెట్టివేయడమే కాదు.. దూషించినట్టు ఉన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాకు ఎక్కింది.. ఇక, ఇవాళ బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటి వ‌ద్ద ఉన్న అక్ర‌మ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇక, శ్రీకాంత్‌ త్యాగి నలుగురు సన్నిహితులను అదుపులోకి తీసుకున్నామని, త్యాగికి చెందిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని నోయిడా పోలీసులు ప్రకటించారు.. త్యాగిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 354 కింద శుక్రవారం కేసు నమోదు చేశారు పోలీసులు.. త్యాగి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.. అతడిని వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని చెబుతున్నారు యూపీ పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here