ముక్కలేనిదే ముద్ద దిగదు కొందరికి. అయితే తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధర కే చికెన్ ఇస్తామంటే ఎవరైనా ఊరుకుంటారా. షాప్ వద్ద ఎగబడ్డ జనంతో యజమానికి చుక్కలు కనిపించాయి, నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని భారత్ చికెన్ సెంటర్లో 99 రూపాయలకు కిలో చికేన్ అమ్మడంతో బారులు తీరారు మాంసం ప్రియులు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలకేంద్రంలోనీ భారత్ చికెన్ సెంటర్లో 99 రూపాయలకే కిలో చికెన్ విక్రయాలు చేపట్టడంతో మాంసం ప్రియులు బారులు తీరారు.
ముజ్జు అనే చికెన్ సెంటర్ వ్యాపారి 99 రూపాయలకే కిలో చికెన్ అనడంతో జనాలు భారీగా క్యూ కట్టారు. ఈ సందర్భంగా చికెన్ సెంటర్ ఓనర్ ముజ్జూ మాట్లాడుతూ తనకు కోళ్ల ఫారం లు ఉన్నాయని అప్పుడప్పుడు ఇలాగా చికెన్ విక్రయాలు తక్కువ ధరకే చేపడుతామన్నారు. మండల ప్రజలకు తక్కువ ధరలకే చికెన్ తినిపించాలనే ఉద్దేశంతో రెండు రోజుల పాటు చికెన్ 99 రూపాయలకే అమ్మకాలు చేపడతామన్నారు. ప్రత్యేక దినం ఏం లేదని తెలిపారు. చికెన్ అమ్మకాలలో నిత్యం బయట షాప్ ల కన్న తక్కువ ధరలకే అమ్మకాలు చేస్తామన్నారు..