చండీగఢ్ విశ్వవిద్యాలయం బంద్.. ఇళ్లకు విద్యార్థులు

0
106

ఓ విద్యార్థిని తన సహచరుల ప్రైవేట్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిందనే ఆరోపణలపై మొహాలీలోని చండీగఢ్ యూనివర్శిటీలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. విద్యార్ధులు స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన విద్యార్థిని, ఆ వీడియోలను తన స్నేహతుడికి పంపించింది. దీంతో.. ఆమె స్నేహితులు ఆ వీడియోలను పోర్న్‌సైట్లలో పెట్టడంతో సంచలనంగా మారింది. ఈ వీడియోలు బయటకు వచ్చినట్లు.. దీంతో పలువురు విద్యార్థినీలు ఆత్మహత్యయత్రం కూడా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో నిన్న చండీగఢ్‌ యూనివర్సీలో ఈ ఘటన కారకులను శిక్షించాలని విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీకి సెలవు ప్రకటించారు అధికారులు. చండీగఢ్ విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 24 వరకు బంద్ ప్రకటించారు అధికారులు. దీంతో విద్యార్థులు ఇంటికి వెళ్లిపోతున్నారు.

 

ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న రాత్రి చండీగఢ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిరసనలు చెలరేగడంతో సీనియర్ పోలీసు అధికారులు అర్థరాత్రి నిరసనలో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీఎస్‌ భుల్లర్ విద్యార్థులకు ఈ ఘటన కారణమైన వారిని కోర్టు ముందు ఉంచి శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు శాంతించి నిరసనలు నిలిపివేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here