హీరోయిన్ చాందినీ చౌదరికి వాట్సాప్ వేధింపులు

0
485

షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ స్టార్ట్ చేసి..హీరోయిన్‌గా విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరి.. ‘కలర్ ఫోటో ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.. ఈ మూవీతో నటనపరంగా ప్రశంసలు అందుకుంది. చాందినీ చౌదరి తనను కొందరు గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వేధిస్తున్నారంటూ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలుగమ్మాయి చాందినీ అందుకు సంబంధించివ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది. ‘‘గత కొన్ని నెలల నుండి అంతర్జాతీయ నంబర్స్ ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కామ్‌కి పాల్పడుతున్నారు..వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడానికి మా పేర్లు వాడుకుంటూ వాట్సాప్‌లో మెసేజులు పంపిస్తున్నారు.. అంతటితో ఆగకుండా వేధింపులకు కూడా పాల్పడుతున్నారు.. ఇలా నన్నే కాదు.. నా కో స్టార్స్ పేర్లు, ఫోటోలను కూడా వాడుతున్నారు.. మీలో ఎవరికైనా ఇలాంటి మెసేజెస్ వస్తే దయచేసి రిపోర్ట్ చేయండి.. మీ వివరాలను వారితో షేర్ చేసుకోకండి’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్క్రీన్ షాట్లను షేర్ చేసింది చాందినీ చౌదరి.. ప్రస్తుతం చాందినీ కెరీర్ విషయానికొస్తే ఇటీవల ‘సమ్మతమే’ సినిమాతో అలరించింది.. పాపులర్ ఓటీటీల్లో వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉంది.. అలాగే యంగ్ హీరో నవదీప్ తన మిత్రుడితో కలిసి నిర్మిస్తున్న సినిమాలోనూ ప్రధాన పాత్రలో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here