కందుకూరు బాధిత కుటుంబాలకు చంద్రబాబు భరోసా

0
764

కందుకూరు ఘటనలో చనిపోయిన కార్యకర్తల మృత దేహాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కందుకూరు ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. కందుకూరు ఘటన లో చనిపోయిన వారి కుటుంబానికి పార్టీ తరపున రూ.15 లక్షల సాయం. నాయకులు అందిస్తున్న సహాయంతో కలిపి ఒక్కో కుటుంబానికి రూ.24 లక్షల చొప్పున సాయం అందిస్తామన్నారు. చనిపోయిన ఎనిమిది మందిలో ఆరుగురు బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారు.

ఈఘటనపై ప్రధాని మోడీ సంతాపం తెలిపి రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. వారికి కూడా ధన్యవాదాలు. ఈ ఘటన చాలా బాధాకరం. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు వచ్చా. పిల్లల్ని చదివించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. వాళ్లను పైకి తీసుకొచ్చే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్టు తీసుకుంటుంది. బాధిత కుటుంబ సభ్యులకు ఏ ఆధారమూ లేదన్న భయం లేకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం. 40 ఏళ్లకు పైబడి రాజకీయాల్లో ఉన్నా. చైతన్య రథంతో దేశంలోనే ఎన్టీఆర్ మొదటి సారిగా రోడ్ షో ప్రారంభించారు. తర్వాత అద్వానీ రథయాత్ర వచ్చింది. నేను కూడా పాదయాత్ర, బస్సుయాత్ర, రోడ్ షో నిర్వహించాను. అన్ని రాజకీయ పార్టీ నేతలూ చేస్తున్నారు.ఏ నాయకులు వచ్చినా పోలీసులు శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here