ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలను అభినందించిన చంద్రబాబు

0
65

అమరావతి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో కొత్త ఎమ్మెల్సీలకు అభినందన సభ‍ జరిగింది. అభినందన సభకు హాజరయ్యారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ముగ్గురిది.. ఒక్కో కష్టం. డబ్బు లేనిదే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదన్న పరిస్థితికి చంద్రబాబు, కొత్త ఎమ్మెల్సీలు చరమ గీతం పాడారన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. బాబాయిని గొడ్డలిపోటుతో చంపేశాక ప్రజలు భయపడుతున్నారు.ఓటు అడగడానికి రావొద్దు.. మీకే ఓటేస్తామని వేపాడ చెప్పిన విషయం నిజం. ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తంగా ఉంది.

వేపాడకు ఎకనమిస్టుగా మంచి పేరు ఉంది.మంచి పేరు ఉంది కాబట్టే వేపాడ ఎమ్మెల్సీగా గెలిచారు.వేపాడ విశ్వసనీయతే గెలిపించింది.వేపాడ పేరు ప్రకటించి వెంటనే పార్టీ గెలిచిందనే ఫీలింగ్ వచ్చేసింది.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు శ్రీకాంత్ అండగా నిలిచారు.వేపాడ, శ్రీకాంత్, రాంగోపాల్ రెడ్డి భార్యలు వారి గెలుపు కోసం కష్టపడ్డారు.శ్రీకాంత్ టెక్నాలజీని కూడా బాగా వినియోగించుకున్నారు.. ఎమ్మెల్సీగా గెలిచారు.రాంగోపాల్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చే ముందు నేనూ ఆలోచించాను.పులివెందుల బిడ్డ రాంగోపాల్ రెడ్డి. రాంగోపాల్ రెడ్డి పులివెందుల పులి.. జగన్ పులివెందుల పిల్లి.పులివెందుల్లో వైసీపీ రౌడీయిజాన్ని రాంగోపాల్ రెడ్డి అడ్డుకున్నారు.జగన్ పిరికివాడు.తన కోసం చాలా మందిని తన క్రైమ్ లో పార్టనర్లను చేస్తారు.

భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాక కూడా వైసీపీ నేతలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారని అన్నారు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు అయింది.అడిగిన వెంటనే లోకేష్ ఓకే చెప్పారు.. భుజం తట్టారు.అభ్యర్థిత్వాలని అధికారికంగా ఖరారు చేశాక.. లోకేష్ నిరంతరం రివ్యూ చేశారు.ఓటరు నమోదు విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి గెలిచాను.కర్నూల్లో హైకోర్టును వ్యతిరేకిస్తున్న టీడీపీకి ఓటేయొద్దన్నారు.. దాన్ని ఎదుర్కొన్నాం.. ప్రతి ఒక్కరికీ వివరించాం.

జగన్ అరాచకాలపై అనుభవం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరించాం.ముఖ్య నేతలను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లుగా పెట్టాం.తలలు తెగిపడ్డా వెనక్కు తగ్గొద్దు.. భయపడొద్దని కౌంటింగ్ సందర్భంగా టీడీపీ ఏజెంట్లకు చెప్పాను.అవసరమైతే ప్రతిదాడులకూ సిద్దపడ్డాం.టీడీపీ ఏజెంట్ల మీద దాడి చేస్తే.. టీడీపీ వాళ్లనే కొట్టుకుంటూ పోలీసులు అరెస్టు చేశారు.వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి వచ్చి అభినందనలు తెలిపారు.. ఆ తర్వాత అరగంటకే వచ్చి ఆందోళన చేశారు.డిక్లరేషన్ ఫారం ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెట్టారన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల సహకారంతో విజయం సాధించామన్నారు. ఎన్నికల్లో అడుగడుగునా ఎన్నో ఆటంకాలు ఎదురైనా చివరాఖరుకు ధర్మం గెలిచిందన్నారు.జగన్ స్వంత జిల్లాతో పాటు పశ్చిమరాయలసీమలో టీడీపీకి ఓటర్లు బ్రహ్మరథం పట్టడం రాబోయే మార్పులకు నిదర్శనం అన్నారు రామగోపాల్ రెడ్డి.

కంచర్ల శ్రీకాంత్

తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విద్యావేత్త డా.కంచర్ల శ్రీకాంత్ ఉద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను ఆయన వివరించారు. ఇంతకంటే ఇంకేం కావాలి.365 రోజులు పార్టీ కోసం.. చంద్రబాబుని సీఎం చేయడం కోసం పని చేస్తా.ఈ ఎన్నికలను ఓ కేస్ స్టడీగా తీసుకోవాలి.నిఖార్సైన కార్యకర్తకు గౌరవం దక్కుతుందని చెప్పడానికి నేనే నిదర్శనం.2013లో గెలుపునకు అవకాశం లేని కందుకూరు రూరల్ జడ్పీటీసీ నుంచి పోటీ చేసి గెలిచాను.. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలుపు కష్టమని చాలా మంది నిరుత్సాహ పరిచారు.కానీ బంపర్ మెజార్టీ సాధించాను.. ఇప్పుడూ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం.నా గెలుపును లోకేషుకు అంకితం ఇస్తున్నానురెండో ప్రాధాన్యత ఓట్లను పీడీఎఫ్ తో షేరింగ్ చేసుకునే విషయంలో వేరే అభిప్రాయంతో ఉన్నాం.కానీ చంద్రబాబు కాలిక్యులేషన్ పవి చేసింది. ముగ్గురం ఎమ్మెల్సీలుగా గెలిచాం. పార్టీ పటిష్టత కోసం అంతా కలిసి పనిచేస్తాం అన్నారు. తనకు సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

వేపాడ చిరంజీవి రావు

ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన ముగ్గురూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందునా మూడు రాజధానుల పేరుతో వైసీపీ తమకే పరిస్థితి అనుకూలంగా ఉందని భావిస్తే.. ఉత్తరాంధ్రలోనే ఓటర్లు వైసీపీకి బుద్ధి చెప్పారు. అక్కడ విద్యావేత్త వేపాడ చిరంజీవిరావు టీడీపీ ఎమ్మెల్సీ గెలిచారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను.నాకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం చంద్రబాబు ఇచ్చారు.ప్రస్తుత వైసీపీ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు.పట్టభద్రులు మరింత అసంతృప్తితో ఉన్నారు.

ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అంతా నిరాశలో ఉన్నారు.డీబీటీ స్కీంలతో వైసీపీ ఓట్లు దండుకోవడమే పనిగా పెట్టుకుంది.పారిశ్రామిక రంగం కుంటుపడింది.గతంలో ఏపీకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండేది.. కానూ ఇప్పుడు ఆ బ్రాండ్ పోయింది.ఇంటింటికి ప్రచారానికి వెళ్తే ఇంటికి రావద్దు.. మేం ఓటేస్తామని చెప్పారు.పార్టీ ఇన్ఛార్జులు.. అబ్జర్వర్లు చక్కగా పని చేశారు.కార్యకర్తల సహకారం మరువలేనిది. ఉదయం ఐదు గంటలకు చంద్రబాబు ఫోన్ చేసి మరీ నిద్ర లేపారు.చంద్రబాబే అంతగా కష్టపడుతున్నారు.. మేం కష్టపడకపోతే ఎలా అని పని చేశాం అన్నారు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here